Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే

Hyd: వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే

సమాజంలో కుటుంబ వైద్యుడికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డాక్టర్ సృజన్ కుమార్ అన్నారు. వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తద్వారా కుటుంభ వైద్యుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారిని ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదు నగరంలోని పలు శివారు ప్రాంతాలలో క్లినిక్ లు నిర్వహిస్తున్న పలువురు వైద్యులను సన్మానించారు. వారందరికీ వైద్య రంగంలో అందుబాటులోకి వస్తున్న పలు ఆధునిక చికిత్సలు, పరీక్షలు వంటి వాటిని ఆస్టర్ ప్రైమ్ వైద్య నిపుణులు వివరించారు. ఫ్యామిలీ డాక్టర్లు వైద్య రంగానికి గుండె కాయలాంటి వారన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ సృజన్ కుమార్ మాట్లాడుతూ కుటుంబ వైద్యునికి గతంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేదని అన్నారు. నిరంతరం అందుబాటులో ఉండే కుటుంబ వైద్యునికి ఆ కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య సమస్యల పట్ల ఎంతో అవగాహన ఉండేదని తద్వారా వారు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించే వారన్నారు. రోగాలు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే రోగులు ఏదైనా ఇబ్బంది వస్తే సొంత వైద్యం లేదా పెద్ద హాస్పిటల్ కు పరిగెత్తకుండా ముందు తమకు దగ్గరలో ఉన్న కుటుంబ వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు కేక్ కట్ చేసి వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే ను సంబంరంగా జరుపుకొన్నారు. ఫ్యామిలీ వైద్య విదానంపై తమ తమ అనుభవాలను పంచుకొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News