Saturday, November 15, 2025
Homeతెలంగాణbranded water : బ్రాండెడ్ నీళ్లు.. బాదుడు ధరలు... హైదరాబాద్‌లో లీటరు నీటి బాటిల్ రూ.1000!

branded water : బ్రాండెడ్ నీళ్లు.. బాదుడు ధరలు… హైదరాబాద్‌లో లీటరు నీటి బాటిల్ రూ.1000!

Expensive branded water in Hyderabad : నీళ్లు.. జీవనాధారం. కానీ, ఇప్పుడు అవే నీళ్లు విలాసానికి, హోదాకు చిహ్నంగా మారుతున్నాయి. సాధారణ వాటర్ బాటిల్ రూ.20కి దొరికే చోట, లీటరు నీళ్లకు ఏకంగా రూ.1000 చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు భాగ్యనగరవాసులు. ఇటీవల ఓ ప్రముఖ హీరో ఖరీదైన బ్రాండెడ్ నీళ్లు తాగుతూ కనిపించడంతో, ఈ ‘లగ్జరీ వాటర్’ ట్రెండ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ నీళ్లలో ఏముంది..? వాటి ధరెందుకంత ప్రియం..?

- Advertisement -

హోదాకు చిహ్నంగా : హైదరాబాద్ విలాసాల నగరంగా మారుతోంది. ఇక్కడి సంపన్న వర్గాలు, సెలబ్రిటీలు తమ హోదాను చాటుకోవడానికి, ఆరోగ్య స్పృహతో ఖరీదైన బ్రాండెడ్ నీటిని తాగడానికే ఇష్టపడుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా, అంతర్జాతీయ బ్రాండ్లు సైతం నగరంలోని ఖరీదైన మాల్స్, హోటళ్లలో కొలువుదీరుతున్నాయి. సాధారణ బాటిల్ రూ.20 అయితే, ఫ్లేవర్డ్, స్పార్క్‌లింగ్ వాటర్ వంటివి రూ.100కు పైగా పలుకుతున్నాయి.
ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో బ్రాండెడ్ మినరల్ వాటర్ ధర రూ.200 పైమాటే.
ఇక అత్యంత ప్రీమియం బ్రాండ్ల ధర లీటరుకు ఏకంగా రూ.1000 వరకు చేరింది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో, లక్ష రూపాయలు పలికే నీటి బాటిళ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ధర ఎందుకంత ఎక్కువ : ఈ నీటి బాటిళ్ల ధర ఇంత అధికంగా ఉండటానికి కంపెనీలు కొన్ని కారణాలను చెబుతున్నాయి.
మూలం: హిమాలయాల్లోని మంచు కొండల నుంచి, ఆరావళి పర్వత శ్రేణుల్లోని సహజసిద్ధమైన ఊటల నుంచి, లేదా ఐస్‌బర్గ్‌ల నుంచి ఈ నీటిని సేకరిస్తున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి.

ఖనిజాలు: ఈ నీటిలో కాల్షియం, మెగ్నీషియం, బైకార్బనేట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని, అందుకే దీనిని ‘మినరల్ రిచ్’, ‘ఆల్కలైన్ వాటర్’ అని ప్రచారం చేస్తున్నాయి.
హైదరాబాద్‌లో జరిగే కొన్ని వేడుకల్లో, అతిథులకు ఈ ఖరీదైన నీటితో స్వాగతం పలుకుతూ, తమ హోదాను ప్రదర్శించుకుంటున్నారు. ఓ ప్రముఖ బ్రాండ్‌కు చెందిన 250 మి.లీ. సీసా ధర రూ.240 పలుకుతోందంటే, ఈ ట్రెండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సామాన్యుడికి దూరమా : ప్రస్తుతానికి ఇది సంపన్న వర్గాలకే పరిమితమైనప్పటికీ, సెలబ్రిటీలను అనుకరించే క్రమంలో, మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ఖరీదైన నీటి వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం లేకపోలేదు. అయితే, సాధారణ మినరల్ వాటర్‌కు, ఈ బ్రాండెడ్ నీటికి మధ్య ఆరోగ్య ప్రయోజనాలలో గణనీయమైన తేడా ఉంటుందని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad