Saturday, November 23, 2024
HomeతెలంగాణHostels | సర్కారు హాస్టళ్లపై స్పెషల్ ఫోకస్... ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ

Hostels | సర్కారు హాస్టళ్లపై స్పెషల్ ఫోకస్… ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ

సర్కారు హాస్టళ్ల (Govt Hostels) లో విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, ఆ దిశగా సర్కారు హాస్టళ్లపై నిరంతర నిఘా ఉంచాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , గురుకులాల అధికారులు, ప్రత్యేక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, అలాగే విద్యా ప్రమాణలు పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

- Advertisement -

జిల్లా లోని 164 ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలను సందర్శించి వసతి గృహాలలోని స్టోర్ రూమ్, భోజనం, వంట పాత్రలు శుభ్రంగా ఉన్నాయా, వంట సరిగా చేస్తున్నారా?, కామాటి, కుక్, వాచ్ మెన్ పాత్రలను పరిశుభ్రంగా ఉంచుతున్నారా? లేదా? విద్యా బోధన సరిగా ఉందా? లేదా? అని వసతి గృహాల వారి పని తీరును తనిఖీ చేసి, ఆ ఫోటోలను, నివేదికలను రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. వసతి గృహాలను తనిఖీ చేసేందుకు 82 మంది ప్రత్యేక అధికారులు నియమించడం జరిగిందని, ఒక్కొక్కరు రెండు హాస్టళ్లను తనిఖీ చేయాలన్నారు.

వారు సంక్షేమ హాస్టల్స్ (Hostels) తో పాటు స్టోర్స్ లో స్టాక్, స్టాక్ రిజిస్టర్, రోజు వారీ నిర్వహణ రిజిస్టర్లు పరిశీలన చేయాలని, తదుపరి నివేదిక అందించాలని, తనిఖీల సమయంలో పిల్లలతో భోజనాలు చేయాలని సూచించారు. వంట గదుల పరిశీలనలో వంట పాత్రలు ఎప్పడికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ మార్కులు వచ్చిన వసతి గ్రహాల వార్డెన్స్, హెడ్ మాస్టర్ లపై చార్జెస్ ఫ్రేమ్ చేసి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా త్రాగునీరు శుద్దిగా ఉండాలని పిల్లల ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా సంక్షేమ అధికారులు పెరిక యాదయ్య, కోటాజి, ఇలియాజ్ అహ్మద్, ఆర్డీ ఓ లు, తాహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News