Friday, May 2, 2025
HomeతెలంగాణSeethakka: మంత్రి సీతక్క జీవితమే ఓ పోరాటం: సీపీ ఆనంద్

Seethakka: మంత్రి సీతక్క జీవితమే ఓ పోరాటం: సీపీ ఆనంద్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(Women’s Day) సందర్భంగా హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి రన్ ఫర్ యాక్షన్-2025 కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీపీ CV ఆనంద్, అడిషనల్ సీపీ విక్రమ్ మాన్, అడిషనల్ సీపీ క్రైమ్స్ విశ్వ ప్రసాద్ సహా ఇతర డీసీపీలు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీపీ ఆనంద్(CV Anand) మాట్లాడుతూ..మంత్రి సీతక్క(Seethakka) ఎంతో మంది మహిళలకు ఆదర్శమని కొనియాడారు. ఆమె జీవితమే ఒక పోరాటం అని ప్రశంసించారు. కింది స్థాయి నుంచి మంత్రిగా ఎదిగారని తెలిపారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 మందిలో డీసీపీల్లో 8 మంది మహిళా డీసీపీలు ఉన్నారని చెప్పారు. కమిషనరేట్‌లో 18వేల మంది పోలీసు సిబ్బందిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. ఇవన్నీ మహిళా సాధికారికతకు నిదర్శనమని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News