Tuesday, September 17, 2024
HomeతెలంగాణHyderabad: ఈవీ వెహికల్స్ రేస్, ట్రాఫిక్ డైవర్షన్స్

Hyderabad: ఈవీ వెహికల్స్ రేస్, ట్రాఫిక్ డైవర్షన్స్

ఎలక్ట్రిక్ వెహికిల్ రేసింగ్ కు హైదరాబాద్ మహానగరం వేదికగా మారింది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ రేసింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ అమలు ఉంటుందని హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
1) నల్లగుట్ట జంక్షన్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ను ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు అనుమతించకుండా రాణిగంజ్, బుద్ధ భవన్ వైపు మళ్లిస్తారు.
2) తెలుగుతల్లి ఫ్లైఓవర్, బిఆర్కె భవన్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను నక్లెస్ రోడ్డు వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
3) రాజ్ భవన్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్ ను ఈ-కార్ల ర్యాలీ వచ్చే సమయం కాసేపు నిలిపివేసి ర్యాలీ వీవీ స్టాచ్చు జంక్షన్ వైపు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
4) కెసిపి జంక్షన్ నుంచి ర్యాలీ సాగిపోయే వరకు మెర్క్యూర్ హోటల్ వద్ద తాజ్ క్రిష్ణా నుంచి వచ్చే ట్రాఫిక్ నియంత్రిస్తారు.
5) మోనప్పటి ఐలాండ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను, రోడ్డు నెంబర్ 1 నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే ట్రాఫిక్ ను, సాగర్ సొసైటీ నుంచి వచ్చే ట్రాఫిక్ ను, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద ర్యాలీ వెళ్లే సమయంలో ఆపుతారు.
6) కెబిఆర్ జంక్షన్ వద్ద నుంచి ర్యాలీ వెళ్లేటప్పుడు సాగర్ సొసైటీ, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కెబిఆర్ పార్కు వైపు వచ్చే వాహనాలను కెబిఆర్ చౌరస్తా వద్ద ఆపుతారు.
7) ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చే ట్రాఫిక్ ను ర్యాలీ వెళ్లే వరకు రోడ్డు నెంబర్ 45 జంక్షన్ వద్ద నిలిపివేస్తారు.
ఈ నేపథ్యంలో వివి స్టాచ్చు, కెసిపి జంక్షన్, పంజాగుట్ట చౌరస్తా, ఎన్ఎఫ్సీఎల్ చౌరస్తా, ఎస్ఎన్టి చౌరస్తా, సాగర్ సొసైటీ చౌరస్తా, కెబిఆర్ పార్క్ చౌరస్తా, జూబ్లీ చెక్ పోస్ట్, రోడ్డు నెంబర్ 45లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని ట్రాఫిక్ అడిషన్ కమిషనర్ వివరించారు. ఆయా దారుల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News