Saturday, November 15, 2025
HomeతెలంగాణIndependence Day : 79వ స్వతంత్ర దినోత్సవం.. ఘనంగా హైటెక్‌ సిటీలో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

Independence Day : 79వ స్వతంత్ర దినోత్సవం.. ఘనంగా హైటెక్‌ సిటీలో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

Independence Day CREDAI Property Show : 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో రెండు కీలక కార్యక్రమాలు జరిగాయి. మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించగా, CREDAI హైదరాబాద్ ప్రాపర్టీ షో 2025 హైటెక్స్‌లో ఘనంగా మొదలైంది.

- Advertisement -

CREDAI హైదరాబాద్ ప్రాపర్టీ షో

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఆగస్టు 15–17 వరకు జరిగే ఈ CREDAI Hyderabad Property Show 2025ను ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సారి “Choice is Yours” థీమ్‌తో జరుగుతోన్న ఈ ప్రదర్శనలో 70కి పైగా డెవలపర్లు తమ 300కు పైగా RERA ఆమోదిత ప్రాజెక్టులను — అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులు, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్ స్పేసులు — ఒకే వేదికపై ప్రదర్శించారు. అగ్రశ్రేణి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సంబంధిత రంగాల ప్రతినిధులు తమ సేవలను, ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు.

 

ALSO READ:   Netaji AI Movie : నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవిత చరిత్రపై AI మూవీ.. ట్రైలర్ రిలీజ్

CREDAI Hyderabad అధ్యక్షుడు ఎన్. జయదీప్ రెడ్డి మాట్లాడుతూ..  “హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులతో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది” అని అన్నారు. కాగా, సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ కాన్సర్ట్‌లు ఈ షోను మరింత ఆకర్షణీయంగా చేశాయి.

CREDAI Hyderabad ప్రెసిడెంట్ – ఎలక్ట్ బి. జగన్నాథ్ రావు మాట్లాడుతూ , “హైదరాబాద్ ఐటీ, మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఈవీ, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024లో రూ.1 లక్ష కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగాయి. వాణిజ్య రంగంలో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్, గూగుల్ రెండవ అతిపెద్ద క్యాంపస్ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలోనే వేగంగా 100 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కలిగిన నగరంగా హైదరాబాద్ నిలిచింది” అని అన్నారు.

CREDAI Hyderabad ప్రధాన కార్యదర్శి కె. క్రాంతి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. “మన జల వనరులు ఆందోళనకరంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన HYDRAA కార్యక్రమం భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించే విప్లవాత్మక పథకం. అలాగే EAGLE కార్యక్రమం మాదక ద్రవ్యాల నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తోంది. స్థిరమైన అభివృద్ధి కోసం నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, పర్యావరణహిత పద్ధతులు ప్రతి ప్రాజెక్టులో అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం” అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad