Monday, November 17, 2025
HomeతెలంగాణHyderabad MLC Election: ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్

Hyderabad MLC Election: ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (Hyderabad MLC Election) ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులలో 21 మంది ఓటు వేశారు. బీఆర్ఎస్ మినహా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులు తమ ఓటు బక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో నిలిచారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉండటం, కాంగ్రెస్ సభ్యులు పోలింగ్ లో పాల్గొనడంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మొదలైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad