Tuesday, May 20, 2025
HomeతెలంగాణHydra: ఫిల్మ్ నగర్‌లో హైడ్రా నజర్.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Hydra: ఫిల్మ్ నగర్‌లో హైడ్రా నజర్.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Hydra| గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా కూల్చివేతలు కొనసాగిస్తున్న హైడ్రా అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. దీంతో కబ్జారాయుళ్లు బెంబేతలెత్తిపోతున్నారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఆక్రమణలను తొలగించిన అధికారులు.. తాజాగా సినిమా సెలబ్రెటీలు ఉండే ఫిల్మ్ నగర్‌పై కన్నేశారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు GHMC అధికారులతో కలిసి అక్కడ కూల్చివేతలు చేపట్టారు.

- Advertisement -

రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడంపై స్థానికుల ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఫిల్మ్ నగర్ లేఅవుట్ పరిశీలించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. అదే స్థలానికి అనుకుని ఉన్న ఇళ్ల ప్రహరీని రోడ్డును ఆక్రమించి నిర్మించినట్టు గుర్తించారు. దీంతో అక్కడ ఏర్పాటుచేసిన రేకుల షెడ్డుతో పాటు పక్కనే ఉన్న ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారు. ఆ వెంటనే డెబ్రీస్‌ను తొలగించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌ అనురాగ్ జయంతితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన స్థలంలో వెంటే రోడ్డు నిర్మించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News