HYDRA: హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘హైడ్రా’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు కమిషనర్‌గా సీనియర్ అధికారి రంగనాథ్‌ను నియమించింది. ఈ సంస్థ ఏర్పాటైన దగ్గరి నుంచి కబ్జాదారుపైల కొరడా ఝూళింపిచండం మొదలుపెట్టింది. ముందుగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. దీంతో హైడ్రా పేరు మార్మోగిపోయింది. అనంతరం నగరంలో చెరువులు, కుంటలను అక్రమించుకుని కట్టిన నిర్మాణాలను తొలగిస్తోంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. పేదలకు ఓ న్యాయం.. పెద్దలు ఓ న్యాయమా అంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇదే సమయంలో పాతబస్తీలో సకలం చెరువును అక్రమించుకుని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజీని నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కాలేజీ కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. కానీ మళ్లీ వెనకడుగు వేసింది. దీనిపై బీజేపీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒవైసీ బ్రదర్స్‌కు భయపడి ప్రభుత్వం ఫాతిమా కాలేజీ జోలికి వెళ్లడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. పేదల నిర్మాణాలు కూల్చినప్పుడు ఒవైసీ కాలేజీని ఎందుకు కూల్చరంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మండిపడుతున్నారు. దీంతో ఫాతిమా కాలేజీ ఎందుకు కూల్చలేకపోతున్నామో హైడ్రా ఓ ప్రకటన విడుదల చేసింది. సకలం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కాలేజీ నిర్మించినందుకు గతేడాది సెప్టెంబర్‌లోనే తొలగించాలని అనుకున్నామని తెలిపింది.

అయితే పేద ముస్లిం విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నారని పేర్కొంది. ఈ కాలేజీలో సుమారు 10వేల మందికి పైగా విద్యార్థినులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించింది. నిరుదపేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబాటుతనం నుంచి విముక్తి కల్పించేలా విద్యను అందిస్తుందని స్పష్టం చేసింది. అందుకే సామాజిక కోణంలో ఆలోచించి భవనం కూల్చలేకపోతున్నామని వివరించింది. ఇదే సమయంలో ఇతర భూములు కబ్జా చేసి ఎంఐఎం నాయకుల ఆస్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చింది.
Also Read: భద్రాచలం ఆలయ ఈవోపై దాడి
హైదరాబాద్‌ను ఒకప్పు లేక్ సిటీగా పిలిచేవారు. నగరంలో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు కనపడేవి. కాలక్రమేణా ఇవి కబ్జాకు గురయ్యాయి. దీంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు నగరంలో వరదలు ముంచెత్తుతున్నాయి. లోతట్లు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా కృషితో నగరంలోని చెరువులకు పూర్వ జలకళ సంతరించుకుంటుంది. ఇటీవల బతుకుమ్మ కుంట రూపురేఖలు మారిపోయాయి. అలాగే మిగిలిన కుంటలు, చెరువులను కూడా కబ్జాకోరల నుంచి విముక్తి కల్పించి అందమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది.


