హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా (HYDRAA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలపై ప్రజల నుంచే ఫిర్యాదులు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా 2025 జనవరి నుంచి ప్రతి సోమవారం బుద్ధభవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నారు.
- Advertisement -
చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వాలని ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRAA Commissioner Ranganath) పిలుపునిచ్చారు. కొద్ది రోజులుగా చెరువులు, నాలాలు, పార్కులు కబ్జాకి గురవుతున్నట్లు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు హైడ్రా సరికొత్త నిర్ణయం తీసుకుంది.