Sunday, December 22, 2024
HomeతెలంగాణIIMC Hyd: ప్రసూతి ఆసుపత్రిలో దుప్పట్ల పంపిణీ

IIMC Hyd: ప్రసూతి ఆసుపత్రిలో దుప్పట్ల పంపిణీ

ఏటా ఇలాంటి సేవా..

ఐఐఎంసి కళాశాల, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త ఆధ్వర్యంలో కోఠి ప్రసూతి ఆసుపత్రిలో 200 మంది బాలింతలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు సరాపు లక్ష్మణ్ గుప్త మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమానికి దాతలు 100 దుప్పట్లను, రఘువీర్ 100 దుప్పట్లను అందజేశారని తెలియజేశారు.

- Advertisement -

అనంతరం ఐఐఎంసి కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శీతాకాలంలో వివిధ ప్రాంతాల్లో కళాశాల ఎన్ ఎస్ ఎస్ & ఎన్ సి సి వాలంటీర్ల ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ తిరుమల రావు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు యూనిట్ 1&2 సత్యనారాయణ, ఇ. రామకృష్ణ, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ వసంత్ కుమార్, బి.శ్యాం సుందర్, 15 మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, 15 మంది ఎన్ సి సి కాడేట్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News