Saturday, November 23, 2024
HomeతెలంగాణIllandukunta: మానవతా దృక్పథాన్ని చాటుకున్న తహసిల్దార్

Illandukunta: మానవతా దృక్పథాన్ని చాటుకున్న తహసిల్దార్

ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన అగ్గి చంద్రమౌళి నడవలేని స్థితిలో ఉండడంతో అతని ఇంటికి స్వయంగా వెళ్లి భూమి పట్టా మార్పిడి చేసి మానవత్వాన్ని తాసిల్దారు ఠాకూర్ మాధవి చాటుకున్నారు. టేకుర్తి గ్రామానికి చెందిన అగ్గి చంద్రమౌళి కి వ్యవసాయ భూమి ఒక ఎకరం-30 గుంటలు. ఉండగా సదరు భూమిని అతని కుమార్తె పైడిమల్ల కావ్యకు గిఫ్టు రిజిస్ట్రేషన్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు కానీ అగ్గి చంద్రమౌళి ఆరు సంవత్సరముల క్రితం తాడిచెట్టు పైనుండి కిందపడి లేవలేని స్థితిలో మంచానికి పరిమితమై ఉండడంతో మానవతా దృక్పథంతో తాసిల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ ఠాకూర్ మాధవి, మండల గిరిదావర్ రవి , ధరణి ఆపరేటర్ దంసాని దేవేందర్, గ్రామ VRA ల ఆధ్వర్యంలో చంద్రమౌళి ఇంటికెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకం అందజేశారు. ఈ సందర్భంగా టేకుర్తి గ్రామ ప్రజలు మండల అధికారులను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News