Friday, October 4, 2024
HomeతెలంగాణIllanthakunta: ఇల్లంతకుంటలో కవ్వంపల్లి సత్తన్నకు అడుగడుగునా ఘన స్వాగతం

Illanthakunta: ఇల్లంతకుంటలో కవ్వంపల్లి సత్తన్నకు అడుగడుగునా ఘన స్వాగతం

అభివృద్ధి కోసం కాంగ్రెస్ కే ఓటేయండి

మానకొండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకు ఇల్లంతకుంట మండల ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. ఇల్లంతకుంట మండలం కేంద్రంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని నిండా ముంచారని, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వేలకోట్లకు పడగలెత్తారని అన్నారు. ఒక్క నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని అన్నారు. వేసిన నోటిఫికేషన్లు కూడా లీకుల పేరుతో స్కాముల నోటిఫికేషన్ల లాగా మారాయని అన్నారు.

- Advertisement -

ఇల్లంతకుంట మండలంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని వక్తలు ప్రజలను ప్రశ్నిస్తే, రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్ మాత్రమే అభివృద్ధి జరిగిందని ప్రజలు సమాధానమిచ్చారు. మానకొండూర్ కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 6 గ్యారంటీల పథకాలను ప్రజలకు తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించడంతో ప్రజలు కరతాల ధ్వనులతో స్వాగతించారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను నిట్ట నిలువునా ముంచారని అన్నారు. మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడదామని ప్రజలకు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. యువకులను తాగుడకు బానిసలను చేసి ప్రశ్నించే గొంతుకలను నొక్కి పెట్టారని అన్నారు. బడులు, కాలేజీలు కావాలంటే బార్లు, బెల్ట్ షాపులు తెరిచి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఇల్లంతకుంట మండలంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించి యువతకు తగువులు పెట్టారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కమిషన్లు మింగి అవినీతికి తెర లేపారన్నారు.

నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు, యువత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గుర్తు అయిన హస్తం గుర్తుపై ఓటు వేసి కవంపల్లి సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ భవాని రెడ్డి, ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు భూంపల్లి రాఘవరెడ్డి, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్, చిట్టి ఆనందరెడ్డి అంతగిరి బాల పోచయ్య, ఒగ్గు రమేష్, పసుల వెంకటి, ముదిరాజ్ సంఘ మండల అధ్యక్షుడు గొడుగు నర్సయ్య, మండల యువజన సంఘాల అధ్యక్షుడు ఉప్పల అమరేందర్, ఎం రాజు, చిట్టి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News