భీమదేవరపల్లి ఊరచెరువులో మూడు లక్షల చేప పిల్లలు ఎమ్మెల్యే సతీష్ కుమార్ వదిలారు, 54,000 భీమదేవరపల్లి,1,36,500 ముల్కనూర్, 1,05,000 కొత్తపల్లి గ్రామాలకు సంబంధించినవని ఎమ్మెల్యే తెలిపారు. భీమదేవరపల్లి మండల వ్యాప్తంగా 7,96,000 చేప పిల్లలు వదిలినట్లు చేప పిల్లల ఉత్పత్తి ద్వారా ఒక్కొక్క మత్స్యకారునికి 30 వేల రూపాయలు అదనంగా వచ్చే అవకాశం ఉందని ఈరోజు వదిలిన చేప పిల్లలు పెరిగి ఎనిమిది వేల టన్నుల ఉత్పత్తి అవుతాయని అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో 464 చెరువులు వివిధ కుంటలు మరమ్మతులు చేసుకున్నామని అన్ని చెరువులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన చేప పిల్లలను వదులుతుందని అవి పెరిగి పెద్ద అయిన తర్వాత మత్స్యకారులు వాటిని పట్టుకొని ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
మత్స్యకారుల కోసం చేపలు రవాణా చేసుకునేందుకు ట్రాలీ ఆటోలు వ్యక్తిగతంగా బండ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్రంలోని అన్ని కులాలకు వారి ఆత్మ గౌరవ ప్రతీకలుగా కుల సంఘ భవనాలు నిర్మించిందని అలాగే వారి కులవృత్తులను ప్రోత్సహిస్తూ తద్వారా వారి యొక్క సంపాదన శక్తిని పెంచుతున్నామని రాష్ట్ర తలసరి ఆదాయం పెంపుదలకు ఈ పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అందులో కూడా బ్రహ్మాండంగా చేప పిల్లలు వదిలి చేపల ఉత్పత్తి పెంచుతామని, గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా 1,06,000 ఎకరాలు సాగునీరు అందిస్తామని తద్వారా హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు.