Thursday, April 10, 2025
HomeతెలంగాణChegunta: కన్నుల పండువగా రిపబ్లిక్ డే వేడుకలు

Chegunta: కన్నుల పండువగా రిపబ్లిక్ డే వేడుకలు

ఎంపీపీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో..

చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ మనకు 1947 లోనే స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950 జనవరి 26న రాజ్యాంగబద్ధమైన హక్కులను మనం సాధించుకున్నాం అందుకే ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా కమిటీ ద్వారా చేసినటువంటి రాజ్యాంగం జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని వారన్నారు. హక్కులు పొందుటకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించుటకు ఈ రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మెడికల్ శ్రీశైలం పుట్ట మహేష్ అమర్నాథ్ జనార్దన్ గౌడ్ మ్యాకల నాగరాజు తేజ తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News