చెన్నూర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఓటర్లు చెప్పకనే చెప్పి గట్టి షాకిచ్చారు. రాష్ట్రంలోనే ఊహించని విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 37వేల 189 ఓట్ల తేడాతో వివేక్ గెలుపొందారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే హస్తం పార్టీ సూపర్ విక్టరీగా నమోదు చేసింది. వివేక్ నియోజకవర్గానికి లేటుగా వచ్చినా కాంగ్రెస్ మ్యానిపేస్టో, ఆరు గ్యారంటీలు బలంగా సహకరించ్చాయి.. వివేక్ చివరి రోజ్జుల్లో కాంగ్రెస్‌లో చేరి చెన్నూర్ టికెట్ దక్కించుకున్నారు. బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న వివేక్‌ను రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కలిసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు కలిసి వచ్చింది. అంతే కాకుండా చెన్నూర్ టికెట్ కేటాయించగానే వివేక్ రాకెట్ స్పీడ్ లో ప్రచారంలోకి దూసుకుపోయారు. మొత్తానికి చెన్నూర్ ప్రజలు వివేక్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఆదరించారు. వివేక్ ఫ్యామిలీ గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు. గడ్డం వెంకటస్వామి అలియాస్ కాకా తెలుగు ప్రజలకు తెలియనిది కాదు. కాకా తర్వాత రాజకీయ వారసత్వం తీసుకున్న కుమారులు పార్టీలు మారినప్పటికీ రాణిస్తున్నారు. ఈ మధ్యనే బీజేపీకి గుడ్ బై చెప్పిన వివేక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన సీనియార్టీ, ప్రజల్లో ఫాలోయింగ్‌ను చూసిన హైకమాండ్ చెన్నూరు టికెట్ కేటాయించి మంచి చేసింది. వివేక్ తన వంతు పాత్ర పోషించి ఈ ఎన్నికల్లో నియోజకవర్గం ప్రజల సహకారం గెలుపుకు దారి తీసింది. ఇక నుంచి చెన్నూర్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటానని ఇచ్చినహామీ నెరవేర్చుకుంటూ ప్రజల ఋణం తీసుకుంటానని అన్నారు.