గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీకి చెందిన వల్లపు దాసు జయప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, వైద్య చికిత్స నిమిత్తం 10 వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. ఎల్లప్పుడూ అండగా ఉంటానని జయప్రసాద్ కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యం విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 5-10 లక్షల వరకు పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి భరోసా కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఇల్లందు మాజీ మార్కెట్ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు గులగట్టు లెనిన్ యాకూబ్ పాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్ పిల్లలమర్రి వీరస్వామి సూర్య తదితరులు పాల్గొన్నారు.
Garla: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
అండగా ఉంటానన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


