ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోరం కనకయ్య అఖండ మెజార్టీతో విజయం సాధించి మొట్టమొదటి సారిగా గార్లకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అధ్వర్యంలో పట్టణ పురవీధులలో గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఉద్యమకారుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసిందని పదేండ్ల నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేసేందుకు సియం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని ఇప్పటికే రెండు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రజలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుందని ఇందిరమ్మ రాజ్యం స్థాపించడం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే కనకయ్య ను గజా మాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు, జడ్పీటీసి జాటోత్ ఝాన్సీలక్ష్మీ,సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గా ప్రసాద్, సర్పంచ్ అజ్మీర బన్సీలాల్, ఎంపిటీసి లు మాళోత్ వెంకట్ లాల్, బట్టు నాగరాజు, నాయకులు గుండా వెంకటరెడ్డి, శీలం శెట్టి ప్రవీణ్ కుమార్, బానోత్ రవి,జి.శ్రీను, బి.నాగేశ్వరరావు, యం.సైదయ్య, జి.హరి కిషన్, పి.రామారావు, జె.రమేష్, యాకూబ్ పాష, నాగరాజు, రాజశేఖర్, సిపిఐ రాష్ట్ర నాయకులు కట్టె బోయిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.