Sunday, October 6, 2024
HomeతెలంగాణGarla: కాంగ్రెస్‌ గెలుపు ప్రజా విజయమే: ధనియాకుల రామారావు

Garla: కాంగ్రెస్‌ గెలుపు ప్రజా విజయమే: ధనియాకుల రామారావు

మేం ప్రజల్లో మమేకమైనందుకే విజయం

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ప్రజా విజయమని గార్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు అన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని, స్వంత ప్రయోజనాలే తప్ప వారికి ఏది ప్రాధాన్యం కాలేదని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పట్ల అనునిత్యం ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించామని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యమని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని గార్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 9 ఏళ్లలో ఇల్లందు నియోజకవర్గంలో గార్ల మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడుతూ పార్టీ కార్యకర్తలకు అనునిత్యం దిశా నిర్దేశం చేస్తూ ఓవైపు ఉవ్వెత్తున పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు అధికార పార్టీల ఒత్తిడి మానసికంగా అవహేళన చేసి అనేక అక్రమ కేసులు పెట్టినా లెక్కచేయకుండా భయపడకుండా మొక్కవోనే దీక్షపూని భారత్ జోడో యాత్ర, హాత్ సే హాత్, రచ్చబండ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ పనైపోయిందన్న నోర్లను మూయించి..గ్రామాల్లో సైతం పార్టీ బలోపేతం కృషి చేశారన్నారు. అధికారం కోసం కన్న తల్లి లాంటి పార్టీని వీడి ఎందరో అధికార పార్టీలోకి చేరిన ఏనాడు పార్టీను వీడకుండా పార్టీ జెండానే తమ ఎజెండా మార్చుకొని అనునిత్యం మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీ రావాలి అంటూ పార్టీ మనుగడ కోసం అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నాయకులు కష్టానికి తోడు ప్రజల కృషి ఫలితమే నేడు కాంగ్రెస్ పార్టీ కి అఖండ మెజార్టీ తెచ్చి పెట్టిందన్నారు. గార్ల మండల వ్యాప్తంగా 31 పోలింగ్ బూత్ లలో 24 278 ఓట్లు పోలయ్యాయని అందులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి 15,860 ఓట్లు రాగా బిఆర్ఎస్ పార్టీకి 5995 ఓట్లు వచ్చాయని 9865 ఓట్లు మెజార్టీ గార్ల మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చిన గార్ల మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News