Saturday, November 23, 2024
HomeతెలంగాణGarla: నేత్రపర్వంగా హనుమాన్ చాలీసా పారాయణం

Garla: నేత్రపర్వంగా హనుమాన్ చాలీసా పారాయణం

108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం

గార్ల మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వేమిశెట్టి శ్రీనివాస్ కవిత దంపతులు గోదాదేవి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పట్టు వస్త్రములు సమర్పించి దేవాలయంలోని హనుమాన్ విగ్రహం వద్ద 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం హనుమాన్ భక్త బృందం సభ్యులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి దేవాలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా హనుమాన్ చాలీసా 108 పర్యాయములు పారాయణం నిర్వహిస్తున్నామన్నారు.

- Advertisement -

ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు హనుమాన్ చాలీసా పారాయణం ఎంతగానో తోడ్పడుతుందని హనుమాన్ చాలీసా పారాయణంతో దేవాలయం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడిందన్నారు.

ఈ కార్యక్రమంలో భక్తులు పుల్ల ఖండం రమేష్ బాబు జక్కుల పాండురంగారావు రమేష్ బాబు కనక శేఖరం మాలోత్ రాములు మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News