గార్ల మండల కేంద్రంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి, తొలిసారిగా గార్ల పట్టణానికి మధ్యాహ్నం రెండు గంటలకు విచ్చేసి మండల అధికారులతో కలసి సమీక్ష సమావేశంలో పాల్గొంటారని, అనంతరం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికి, గార్ల పట్టణ పురవీధుల గుండా భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
ఈ విజయోత్సవ ర్యాలీలో మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, మహిళా కాంగ్రెస్, నాయకులు, ఎన్ఎస్యుఐ, ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.