హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండల కేంద్రంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం సాయంత్రం సారలమ్మ తల్లి గద్దెపైకి చేరుకోవడంతో ప్రారంభమైంది. కోయ పూజారులు సారలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమను తీసుకొని ఊరేగింపుగా సారలమ్మ గద్దె వద్దకు డప్పు చప్పులు, డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో అంగరంగ వైభవంగా భక్తజనం కేరింతల మధ్య సారలమ్మ దేవతను ఊరేగింపుగా గద్దె పైకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ జాతర ధర్మకర్తలైన పాడి ఉదయ్ నందన్ రెడ్డి సారలమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ సభ్యులు, వీణవంక గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.