తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ నిఘా మరింత కట్టుదిట్టమైన భద్రతను నిర్వహించబోతుంది. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ఈసీ ఆదేశాలతో సెంట్రల్ ఫోర్సెస్ భద్రతా బలగాలు భరిలోకి దిగాయి. దానిలో భాగంగా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల, అరుట్ల గ్రామంలో మహేశ్వరం జోన్ డిసిపి సిహెచ్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో 160 మంది పోలీస్ సిబ్బంది తో “పోలీస్ కవాతు” నిర్వహించడం జరిగిందని మంచాల సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. మంచాల గ్రామంలో 45 నిమిషాలు, ఆరుట్ల గ్రామంలో 60 నిమిషాల పాటు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు.
ప్రలోభాలపై నిఘా.. అక్రమ నగదు తరలింపు, మద్యం బహుమతుల పంపిణీ పై నిఘా పెట్టామన్నారు. మరోవైపు నేరాలను అరికట్టెందుకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, సరైన పత్రాలు లేకుండా నగదు తదితర వస్తువులు తీసుకెళితే సీజ్ చేస్తున్నమని సీఐ తెలిపారు. రాచకొండ పోలీస్ సిబ్బందితో కలిసి ఈ కేంద్ర బలగాలు పలు నియోజకవర్గాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు డిసిపి శ్రీనివాస్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తుకు సహాయంగా కేంద్ర బలగాలు ఉంటాయన్నారు.
ఎన్నికలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి కవాతు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసిపి కె.శ్రీనివాసరావు, ఎసి సిఎపిఎఫ్ బిఎస్.మీనా బృందం, రాచకొండ డివిజన్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది, సాయుధ రిజర్వ్డ్ ఫోర్సెస్, పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.