కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అందరూ అనుకున్న విధంగానే కసిరెడ్డి నారాయణరెడ్డి తన ప్రత్యర్థి తల్లోజు ఆచారి పై 5410 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. కసిరెడ్డి గెలుపుతో కల్వకుర్తిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా పేల్చి తమ అభిమానం చాటుకున్నారు. పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు వడ్డెర బస్తీ ఈదమ్మ గుడి నుంచి పాలమూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ,అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవలు అందించడం జరిగింది. విద్యాసంస్థలు నడిపిస్తూ అందరికి ఆదర్శంగా ఉంటూ మృదుస్వభావి పేరు ఉన్న కసిరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతాడని అన్నారు.