Sunday, September 8, 2024
HomeతెలంగాణKarimnagar: సాంస్కృతిక వైభవాన్ని చాటిన అల్ఫోర్స్ గ్లేర్-2024

Karimnagar: సాంస్కృతిక వైభవాన్ని చాటిన అల్ఫోర్స్ గ్లేర్-2024

ముఖ్య అతిథులు ఆర్. పి పట్నాయక్

కళల ద్వారా విద్యార్థులకు ఉత్సాహం పెరుగుతుందని విజయాల పట్ల విశ్వాసం కల్గుతుందని ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ , అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి.నరేందర్ రెడ్డి, శ్రీ రుద్రరాజు , చైర్మన్ పురపాలక సంఘం, కొత్తపల్లి తో కలిసి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో గేర్ పేరుతో నిర్వహించినటువంటి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై వేడుకల సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి చదువుల తల్లి జ్ఞాన సరస్వతి మాతకు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో కళలకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని మన దేశంలో విభిన్న కళలు ఉన్నాయని ప్రతి కళకు విశిష్టత ఉండడమే కాకుండా అభివృద్ధి మీద ప్రభావం చూపుతుందని అన్నారు.. కష్టపడే వారికి విజయం వెన్నంటునె ఉంటుందని అందుకు నిదర్శనం మన భారతదేశంలోని పలు దిగ్గజాలైన నారాయణమూర్తి , స్వామినాథన్ , సచిన్ టెండూల్కర్ ప్రతేకంగా కరీంనగర్ జిల్లా కు చెందిన సాహితి రత్నం జ్ఞానపీఠ్ అవార్డు గ్రహిత శ్రీ సి.నా.రె అని గుర్తు చేస్తు తల్లిదండ్రులు నిర్దేశించిన ఆశయాలను సరైన పద్ధతిలో సాదించి ఉత్తమంగా ఉండాలని చెప్పారు. సినీ ప్రపంచంలో అపార అనుభవం ఉన్నటప్పటికి సమాజంలో వెలువడుతున్న మార్పులకు అనుగుణంగా వ్యవహరించి ఘన విజయాలను సొంతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు .

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యా భోదనతో నైతిక విలువలు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల దృష్టి సారింపచేస్తు అగ్రగామిగా కొనసాగుతున్నదని డా||వి.నరేందర్ రెడ్డి విద్యారంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తు మార్గదర్శకునిగా ఎన్నో అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటూ ప్రత్యేకత చాటుతున్న వారికి అభినందనలను తెలియజేశారు. విద్యార్థులు విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు పయనిస్తు ఆదర్శంగా కొనసాగాలని అన్నారు .

డా||వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆరంభం నాటినుండి విద్యాసంస్థలో అత్యుత్తమ భోదన సిబ్బందితో విజయమే లక్ష్యంగా ఉత్తమ శిక్షణ అందిస్తున్నామని తెలుపుతూ విద్యార్థులకు అన్ని రకాలుగా అన్ని వసతులను కల్పిస్తు వారిని అన్ని రంగాలలో ముందంజలో నిలుపుతున్నామని తెలిపారు. నాణ్యతమైన ఐ.ఐ.టి నీట్ ఫౌండేషన్ అందిస్తు లక్ష్యాలను సాధింపచేస్తున్నామని అన్నారు . అపూర్వ సహకారాన్ని అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు అభినందనలను తెలియజేశారు.

వేడుకలలో భాగంగా వార్షిక ప్రణాళికల్లో భాగంగా అద్భుత ప్రదర్శన కబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన అయోధ్య రామాయణం, ఫన్ని డ్యాన్స్, ఉట్టిమీద కూడు తదీతర నృత్యాలు అలరింపచేశాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News