Saturday, July 27, 2024
HomeతెలంగాణKarimnagar: తహసిల్దార్ చిల్ల శ్రీనివాస్ పై గతంలోనే పలు ఫిర్యాదులు

Karimnagar: తహసిల్దార్ చిల్ల శ్రీనివాస్ పై గతంలోనే పలు ఫిర్యాదులు

ప్రజా దర్బార్ లోనూ కంప్లైంట్

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల తహసీల్దారుగా పనిచేసిన చిల్ల శ్రీనివాస్ విధుల దుర్వినియోగంపై గతంలోనే ఉన్నతాధికారులకు స్థానికులు పలు ఫిర్యాదులు చేశారు. చిల్ల శ్రీనివాస్ కొత్తపల్లి తహసిల్దారుగా విధులు నిర్వర్తించిన సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని స్థానికుడైన దుర్గం మనోహర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కొత్తపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూములు, మృతి చెందిన వారి భూములు విరాసతులు చేయడం, భూకబ్జాదారులతో కుమ్మక్కై అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నాడని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు, హైదరాబాద్ సీసీఎల్ఏలో, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హైదరాబాదులో, ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ హైదరాబాదులో, యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాదులో, లోకాయుక్తలో, డీజీపీకి సైతం ఫిర్యాదు చేసినట్లు మనోహర్ చెప్పారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రేకుర్తి గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55 సమ్మక్క సారలమ్మ గుట్ట చదును చేసి అమ్మిన సమయంలో లక్షల్లో అక్రమ సంపాదనకు పాల్పడినట్లు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తాహసిల్దార్ చిల్ల శ్రీనివాస్ పై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే తాహసిల్దారుగా విధులు నిర్వర్తించిన సమయంలో జరిగిన అవినీతి అక్రమాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉంటుందని మనోహర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News