మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళి నాయక్ మాట్లాడుతూ తన గెలుపుకు అహర్నిశలు కష్టపడ్డా ప్రతి ఒక్కరికి, సహకరించిన సిపిఐ,టీజేఎస్, వైఎస్ఆర్సిపి పార్టీల నాయకులకు, యువతకు, మహిళలకు, వ్యాపార, వాణిజ్య, ఉద్యోగులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తుందని, అర్హులకు పథకాలు అందేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలలో డాక్టర్ మురళి నాయక్ తన సమీప ప్రత్యర్థి, బిఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ పై 50వేల 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలలో 2 లక్షల 8 వేల 598 ఓట్లకు గాను2 లక్షల 7 వేల 270 ఓట్లు పోలయ్యాయి, అందులో 1లక్ష 16 వేల 644 ఓట్లు డాక్టర్ మురళి నాయక్ కు పోలయ్యాయి.