Monday, November 4, 2024
HomeతెలంగాణMedaram: మేడారంలో భారీ స్క్రీన్లు

Medaram: మేడారంలో భారీ స్క్రీన్లు

ఏడు ఎల్ఈడీ స్క్రీన్లలో..

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరను సజావుగా నిర్వహించడంలో భాగంగా పర్యాటక-సమాచార శాఖ, వివిధ న్యూస్ చానెళ్ళు ఏకంగా ఏడు భారీ ఎల్.ఈ.డీ స్క్రీన్లను ప్రధాన కూడలిలో ఏర్పాటు చేశారు.
3 భారీ ఎల్.ఈ.డీ స్క్రీన్ల ద్వారా మేడారం మహా జాతర విశిష్టతను గురించి వివిధ ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్ లో ప్రసారమయ్యే వార్తలు, జాతర విశేషాలను ఎప్పటికప్పుడు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శిస్తున్నారు.

- Advertisement -


మరో 4 ఎల్.ఈ.డీ స్క్రీన్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆదివాసి గిరిజనుల జీవన విధానం, మేడారం మహా జాతర విశిష్టతను, వినోదాత్మక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తూ భక్తులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News