Friday, November 22, 2024
HomeతెలంగాణQutubullapur: వివేకానంద ప్రచారం

Qutubullapur: వివేకానంద ప్రచారం

ప్రజల మద్దతు కూడగట్టే పనిలో ఎమ్మెల్యే

ఎన్నికల ప్రచారంలో భాగంగా 129 – సూరారం డివిజన్ కట్ట మైసమ్మ సమీపంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టైలరింగ్ వర్కర్స్ యూనియన్ సలహాదారులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం.ఎస్.వాసు ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టైలరింగ్ కార్మికుల యూనియన్ సభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ. వివేకానంద అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలకు తోడ్పాటును అందించేందుకు సీఎం కేసీఆర్ రూపొందించిన బీసీ బంధు ద్వారా టైలరింగ్ పై ఆధారపడి ఉన్న ఎందరికో స్వయం ఉపాధి కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టైలరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాంబశివరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్, కోశాధికారి షంషీర్ భాష, సభ్యులు శివకుమార్, కే. ప్రసాద్, ఎం. సత్యనారాయణ, బి ఆర్ ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, అడబాల వెంకటరత్నం, అనోక్, మారుతి నాయుడు, కిరణ్ పౌల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

125- గాజుల రామారం డివిజన్ వీనస్ ఎన్క్లేవ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సదాశివరెడ్డి, వారి మిత్రబృందం ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర శివారు ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం అయిందన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని కాలనీలు, బస్తీలలో మౌలిక వసతులైన సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను కల్పించామని ఎన్నికల అనంతరం అభివృద్ధిని కొనసాగించేందుకు ముచ్చటగా మూడవసారి మూడవ నెంబర్ పై ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు,దీన్ దయాల్, విజయలక్ష్మి దేవి, రాహుల్, తిరుపతి రెడ్డి, డామినిక్స్, రాజశేఖర్ రెడ్డి, ప్రసాద్, రేఖ, సంధ్యారాణి, చంద్రాలత.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, కమలాకర్, నవాబ్, తెలంగాణ సాయి, చిన్న చౌదరి, సురేష్, శ్రీనివాస్ రావు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా సూరారం కాలనీ, దయానందనగర్, రామ్ లీలా మైదాన్ మార్కెట్ లో ప్రచారం చేశారు 130 డివిజన్ మాాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి. బీఆర్యస్ పార్టీకి మద్దతివ్వాలని, ఎమ్మెల్యే అభ్యర్థి కేపి వివేకానంద్ గౌడ్ ని గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News