Tuesday, July 15, 2025
HomeతెలంగాణVodithala Pranav: కాంగ్రెస్ దే అధికారం

Vodithala Pranav: కాంగ్రెస్ దే అధికారం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

బీఆర్ఎస్, బిజెపిలకు కాలం చెల్లిపోయిందనీ, ఆ నాయకుల మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే హామీల అమలుకు కృషి చేస్తానని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఆరు గ్యారంటీలు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అందే వరకు నిర్విరామంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన మాజీ ఉపసర్పంచ్ మంద రాజిరెడ్డి, పురం శెట్టి శంకరయ్య, బుడిగ జంగం మండల అధ్యక్షులు తూర్పాటి కనకయ్య, కొయ్యడ రాములు, కనకం రామయ్య, గోస్కుల అరవింద్, ఆరేపల్లి సదయ్యలతో పాటు సుమారు 150 మందికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
✳️ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రెడ్డి సంఘం నాయకులు…
అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు నల్ల కొండాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జున్నోతుల రాజిరెడ్డి, మండల నాయకులు పత్తి సమ్మిరెడ్డి లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News