కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పేరు మీద ప్రజలను మోసం చేస్తుందని ఎల్ఆర్ఎస్ వద్దే అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వసూలు పార్టీగా మారిందని విమర్శించారు. ఎల్లారస్ ఉచితంగా ఇవ్వాలని ప్రజల తరఫున ఉండి ఏ పోరాటనికైనా సిద్ధమని తెలిపారు.
ఈ ధర్నాలో మాజీ గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి టిఆర్ఎస్ నాయకులు దేశ్పాండే బీరయ్య యాదవ్ జయపాల్ రెడ్డి విజేందర్ రెడ్డి కొండల్ రెడ్డి రామ్ రెడ్డి రామప్పకౌన్సిలర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.