Wednesday, October 30, 2024
HomeతెలంగాణAnjayya Yadav: రామక్కా గుర్తులు గుర్తుంచుకో రామక్క

Anjayya Yadav: రామక్కా గుర్తులు గుర్తుంచుకో రామక్క

వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ గ్రామాల్లో స్వాగతం

షాద్ నగర్ నియోజకవర్గ గులాబీల జెండాలే రామక్కా.. గుర్తుల గుర్తుంచుకో రామక్కా.. కారు గుర్తుంచుకో రామక్కా.. అనే పార్టీ ద్వారా ప్రజల్లోకి గులాబీ పార్టీ గుర్తు దూసుకెళ్లింది. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు మద్దతుగా ఉందాం కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిద్దాం అంటూ పార్టీ శ్రేణులు పిలుపునిస్తున్నారు.

- Advertisement -

ఈ మేరకు వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అడుగడుగున ఘనస్వాగతం లభించింది. ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. అప్పారెడ్డిగూడ నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు, రూ.98 లక్షలతో సి.సి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు, ఆసరా పింఛన్ ధ్వారా ప్రతి నెల 347 మందికి 8.41లక్షల రూపాయలు వస్తున్నాయన్నారు.

రైతు బంధు లబ్ధిదారులు 985 మంది, 11.1కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 439 మంది, 4.5కోట్లు, రైతు భీమా లబ్ధిదారులు 20మంది, 100లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 74 మందికి 64.11లక్షలు, స్మశానవాటిక నిర్మాణం కోసం 25 లక్షలు, పాత జాతీయ రహదారి నుండి మామిడిపల్లి వయా అప్పారెడ్డి గూడ బిటి రోడ్ 3.7 కోట్లు కేటాయించామన్నారు. నందిగామ నుండి వీర్లపల్లి వయా పిట్టి లమినేషన్ రోడ్ 1.76 కోట్లు, పి డబ్ల్యూ డి రోడ్ నుండీ వీర్లపల్లి వయా ఎర్రకుంట 2.2 కోట్లు, చేర్ల అంతిరెడ్డిగూడ నుండి ఈదులపల్లి 1 కోటి, 1.42 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 4 ట్యాంకుల నిర్మాణంతో 826 ఇండ్లకు త్రాగునీటి సరఫరా చేయడం జరిగిందని పేర్కొన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా 69.85లక్షలతో అంతికుంట, 7 లక్షలతో గుండ్ల కుంట, 8లక్షలతో ఉల కుంటాల పూడికతీత, వీర్లపల్లి కుర్వ కమ్యూనిటీ హాల్ 15 లక్షలు, వీర్లపల్లి స్కిల్ డెవలప్మెంట్ భవనం 15 లక్షలు, వీర్లపల్లి డ్వాక్ర భవనం 15 లక్షలు, అప్పారెడ్డి గూడ డ్వాక్ర భవనం 15 లక్షలు వెచ్చించామని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కొనసాగుతాయని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ అంజన్నకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News