వలిగొండ పట్టణ కేంద్రంలో మెయిన్ రోడ్డుపై గుండెపోటుతో ఓ మహిళ పడిపోయినది. వాహనాలు తనిఖీలు చేస్తున్న స్థానిక ఎస్సై మహేందర్ ఆ మహిళను గమనించి ఆమెకి సిపిఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మహిళా భువనగిరి మండలం మన్యెంవారి వంపుకు చెందిన బోయిన వెంకటమ్మగా గుర్తించారు. సకాలంలో ప్రధమ చికిత్స నిర్వహించిన స్థానిక ఎస్సైని పలువురు అభినందించారు.