ప్రజా సమస్యలను వెలికితీసి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో ‘తెలుగు ప్రభ’ దిన పత్రిక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ చంద్రయ్యలు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు ప్రభ-2024 నూతన క్యాలెండర్, డైరీని ఎస్పీ, అదనపు ఎస్పీల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన పత్రికల్లో తెలుగు ప్రభ పత్రిక ముందు వరుసలో ఉందని, రంగు రంగుల డిజైన్లతో పాఠకులకు చూడగానే చదవాలనిపించే, అందరిని ఆకట్టుకునే రీతిలో పత్రిక రూపొందిస్తున్నారని, క్యాలెండర్, డైరీలు సైతం చాలా అందంగా రూపొందించారని ఇది ఇలానే కొనసాగించాలని సూచించారు.
పాత్రికేయ వృత్తి చాలా గొప్పదని, పాత్రికేయులు రాస్తున్న వార్తలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలని, పాత్రికేయులుగా గుర్తింపు పొందినవారు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, మనకు కనిపించేవన్నీ నిజాలని నమ్మకుండా పూర్తి విశ్లేషణ చేసిన తర్వాతే వాస్తవాలను మాత్రమే పత్రికల్లో రాయాలని ఇది సమాజ శ్రేయస్సుకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేరాల రాజు కుమార్, ఆయా మండలాల పాత్రికేయులు రాజశేఖర్, సుధాకర్, శ్రీహరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.