శంషాబాద్ అంతర్జాయతీయ విమానాశ్రయంలో(Shamshabad International Airport) కలకలం చోటు చేసుకుంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానం(Indigo flight)లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ హైదరాబాద్ ATCకు సమాచారం అందించారు. అనంతరం వారి అనుమతి తీసుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా విమానాన్ని ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలోని 144 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగి ఉంటే తమ పరిస్థితి ఏంటని తలుచుకుని ఆందోళనకు గురయ్యారు. కాగా సాంకేతిక లోపంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.