Sunday, October 6, 2024
HomeతెలంగాణIndira: కడియంవి కల్లబొల్లి మాటలే

Indira: కడియంవి కల్లబొల్లి మాటలే

నామినేషన్ దాఖలు

స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం శివాజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ కు ముఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఉత్తమ్ రావు దాల్వి, మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కైలాస్ నేత పాల్గొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సింగపురం ఇందిర మాట్లాడుతూ ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది నా కుటుంబ సభ్యులలాగా నన్ను భావించి నా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, రానున్న రోజులలో కూడా ఇలాగే నన్ను ఆదరించగలరని కోరుతున్నాను.

నాడు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా స్టేషన్గన్పూర్ నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురాలేని మీరు ఈనాడు అభివృద్ధి చేస్తాననడం చాలా విచిత్రంగా, హాస్యాస్పదంగా ఉంది. కానీ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను తప్పక అమలు చేస్తాం, స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కావాలో అలాంటి అభివృద్ధి చేసి చూపెడతానని మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News