Saturday, November 15, 2025
HomeతెలంగాణIndiramma Houses: ఇంటింటికీ ఇందిరమ్మ వెలుగు... 21 నుంచి గృహప్రవేశాల సంబురం!

Indiramma Houses: ఇంటింటికీ ఇందిరమ్మ వెలుగు… 21 నుంచి గృహప్రవేశాల సంబురం!

Telangana Indiramma Housing Scheme: పేదల సొంతింటి కలకు రెక్కలు! ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 21న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ మహత్తర కార్యక్రమంలో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేవు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాల పురోగతి ఏ దశలో ఉంది..? బిల్లుల జాప్యంతో సతమతమవుతున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న భరోసా ఏంటి? కార్యాలయాల చుట్టూ తిరగకుండానే సమస్యలను పరిష్కరించుకునే సరికొత్త మార్గం ఏమిటి…?

- Advertisement -

రాష్ట్రంలోని పేదలకు సొంతింటి భరోసానిచ్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. నిర్మాణాలు పూర్తి చేసుకున్న గృహాల ప్రారంభోత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 21వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ మండలం, బెండలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి, ఈ బృహత్తర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో స్థానిక మంత్రులు, శాసనసభ్యులు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/today-moderate-rains-in-telangana-by-hyderabad-meteorological-department-officials/

నిర్మాణాల పురోగతి ఇలా : గృహ నిర్మాణ శాఖ గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 44 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నూటికి నూరు శాతం పూర్తయింది. మరో 4 వేల గృహాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. నెలాఖరులోగా వీటిలో వీలైనన్ని ఎక్కువ గృహాలను పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో (హైదరాబాద్ మినహా) మొత్తం 3.68 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, 3.13 లక్షల మందికి మంజూరు పత్రాలు అందజేశారు. వాటిలో 1.96 లక్షల ఇళ్ల పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయి (గ్రౌండింగ్ అయ్యాయి). ప్రస్తుతం 85 వేల ఇళ్లు పునాది దశలో, 10 వేల ఇళ్లు గోడల దశలో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మీద 98,969 ఇళ్లు (26.85%) వివిధ నిర్మాణ దశల్లో పురోగతిలో ఉన్నాయి.

చేతిలోనే సమాచారం.. పారదర్శకతే పరమావధి : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పురోగతి, బిల్లుల మంజూరు వంటి వివరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా సరికొత్త ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు తమ ఫోన్ నంబర్, ఆధార్, రేషన్ కార్డు లేదా అప్లికేషన్ నంబర్‌తో లాగిన్ అయి తమ ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అరచేతిలోనే చూసుకోవచ్చు.

ALSO READ:https://teluguprabha.net/telangana-news/stray-dog-attacks-rise-in-kamareddy-district-with-30-cases-in-3-days/

బిల్లుల జాప్యానికి చెక్.. అయోమయానికి తెర : కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు తొలిదశ బిల్లులు కూడా అందకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు, బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా ఇవ్వడం, ఖాతాలు నిరుపయోగంగా (inactive) ఉండటం వంటి కారణాలతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారంగానే వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీని ద్వారా లబ్ధిదారులు తమ బిల్లు ఏ కారణంతో ఆగిపోయింది? ఏ అధికారి వద్ద పెండింగులో ఉంది? వంటి వివరాలను స్వయంగా తెలుసుకుని, తప్పులను సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో సమాచారం అందుబాటులో ఉండటంతో లబ్ధిదారులు సులువుగా తమ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad