Wednesday, June 11, 2025
HomeతెలంగాణJadcharla: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా బంగారు మైసమ్మ దేవత

Jadcharla: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా బంగారు మైసమ్మ దేవత

ఘనంగా దసరా ఉత్సవాలు

దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి (డాగ్) బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత దసరా పండుగ రోజు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

దసరా మహోత్సవంలో భాగంగా దేవాలయ చైర్మన్ గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, వైస్ చైర్మన్ గుండు చంద్ర శేఖర్, ప్రధాన కార్యదర్శి ఘనాతే విజయ్ కుమార్, అమ్మవారి భక్తులు గోనెల నరేష్ రాగవేణి దంపతులు, కావేరమ్మపేట, జడ్చర్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు పున్న కాశీ విశ్వనాథ్ లు హాజరై ముందుగా గణపతి, గౌరీ పూజ నిర్వహించి, శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, కుంకుమార్చన, శమీ పూజ వైభవంగా నిర్వహించి ప్యాలాల లడ్డు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

భక్తులు తమ వాహన పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో భక్తులు గుండు సాయి ప్రియ, శ్రీనివాసులు, జయమ్మ, శివ కుమార్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News