Monday, November 17, 2025
HomeతెలంగాణJadcharla: పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Jadcharla: పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

పండుగ పూట..

దసరా పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకొని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి తన వార్డు క్లస్టర్ లో పని చేసే పారిశుద్ధ కార్మికులకు దసరా కానుకగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివని, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వారిని భగవంతుడిలా భావించాలని, వారి సేవకు చిరు కానుకగా దసరా పండుగను పురస్కరించుకొని సరుకులు పంపిణీ చేశామని అన్నారు.

- Advertisement -

కార్యక్రమంలో కాలనీ వాసులు నరసింహారావు, సత్య నారాయణ, హనుమంత్ రెడ్డి, మురళి, నరేందర్ గౌడ్, కిరణ్, గోవర్ధన్, హరీష్, కృష్ణయ్య, సుధాకర్, బత్తుల వెంకటేష్, నారాయణ, రవీందర్, కురుషిద్, శివ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad