Sunday, July 7, 2024
HomeతెలంగాణJadcharla: ప్రిన్సిపల్ సెక్రెటరీకి మున్సిపల్ కార్మిక సంఘం ఫిర్యాదు

Jadcharla: ప్రిన్సిపల్ సెక్రెటరీకి మున్సిపల్ కార్మిక సంఘం ఫిర్యాదు

ఈపీఎఫ్ గురించి ఫిర్యాదు

జడ్చర్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలలో 2012 నుండి 2014 వరకు కట్ చేసిన ఈపీఎఫ్ అమౌంట్ ను కార్మికుల వ్యక్తిగత అకౌంట్ లో జమ చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ లకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్చర్ల కార్మికుల వేతనాల్లో కట్ చేసిన ఈపీఎఫ్ నిధులను కార్మికుల వ్యక్తిగత అకౌంట్ లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిలు జనగాం రాజమల్లు, పాలడుగు సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజనర్సు, సిఐటియు నాంపల్లి నియోజకవర్గ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News