బీసీ బిడ్డగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపాలని, పార్లమెంటులో గళమెత్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి నడిమింటి శ్రీనివాస్ కోరారు. జడ్చర్ల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిసి కుల సంఘాల, ప్రజా సంఘాల నాయకనిగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికై పోరాటం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికై మహబూబ్ నగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను హార్మోనియం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి శ్రీనివాస్ ని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మన పక్షాన గలాన్ని వినిపించే అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రజక రిజర్వేషన్ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాగన్న, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు రాజు, పట్టణ అధ్యక్షులు శివకుమార్, నాయకులు నర్సింలు, లక్ష్మయ్య, హుస్సేన్, కోటకాడి నర్సింలు, వెంకటేష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.