Saturday, July 27, 2024
HomeతెలంగాణJadcharla: దేవాలయ భూములను పరిరక్షించండి

Jadcharla: దేవాలయ భూములను పరిరక్షించండి

అన్యాక్రాంతం కాకుండా..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములను పరిరక్షించాలని సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ అన్నారు. జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర దేవాలయ భూములను పరిరక్షించాలని, దేవాలయ భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి, దేవాలయ భూములలో అక్రమ నిర్మాణాలు ఆపాలని జడ్చర్ల తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డికి సామాజిక కార్యకర్త అనిల్ కుమార్, నాయకులు భాగి కృష్ణయ్య వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం దాతలు అందించిన భూములను అన్యాక్రాంతం కాకుండా దేవాలయ భూములను గుర్తించి వాటిలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News