Sunday, November 24, 2024
HomeతెలంగాణJagadish Reddy: దేశ రాజకీయాల్లో గులాబీ శకం మొదలు

Jagadish Reddy: దేశ రాజకీయాల్లో గులాబీ శకం మొదలు

దేశ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా బిఆర్ యస్ రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంద్రప్రదేశ్ లతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి బి ఆర్ యస్ లో చేరేందుకు బారులు తీరుతున్న రైతులు, రైతాంగ ప్రతినిధుల ఉదంతమే ఇందుకు నిదర్శనమన్నారు.  దేశ రాజకీయాల్లో గులాబీ శకం మొదలైందని ఆయన ప్రకటించారు.

- Advertisement -

బి ఆర్ యస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో బాగంగా సోమవారం రోజున నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పి ఏ పల్లి మండల కేంద్రంలోనీ అంగడిపేట లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక శాసనసభ్యులు జిల్లా బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు నేనావత్ రవీంద్ర నాయక్ అధ్యక్షత వహించిన ఈ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..గులాబీ జెండాతో తెలంగాణా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు యావత్ భారతదేశం మొత్తంలో ఒక్క తెలంగాణా రాష్ట్రంలో అమలవుతున్నాయి అంటే అది గులాబీ జెండా కున్న పవర్ మాత్రమే నని ఆయన చెప్పారు.

 గ్రామంలో జరిగిన బి ఆర్ యస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి జగదీష్ రెడ్డి మ జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి  మండలం. ఈ సందర్భంగా ఆయా మండల కేంద్రాలలో జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్ది మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధతో ఇంటింటికి మంచినీరు అందించే పధకం సైతం గులాబీ జెండా ఎగురుతున్న తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News