Friday, November 22, 2024
HomeతెలంగాణJagityala: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

Jagityala: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల మున్సిపాలిటి పరిధిలో, నూకపల్లిలో నిర్మించిన 4520 గృహములలో మిగిలి పోయిన మౌళిక వసతులైన మురికి కాలువలను, పనులను వేగ వంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 4520, గృహములలో అలాట్ మిగిలి పోయిన ఇండ్లను అలాట్ చేయుటకు లబ్దిదారులను ఎంపిక చేయుటకు స్థానిక శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ హౌసింగ్, రెవెన్యూ పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, విద్యుత్ శక్తి, మున్సిపల్ అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు.

- Advertisement -

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల పట్టముకు మంజూరైన (4520) డబుల్ బెడు రూమ్ ఇండ్లను ఎంపిక చేసి అలాట్ చేశారు. మిగతా బ్యాలెన్స్ గృహాలను ఎంపిక చేయుటకు మీ సేవ ద్వారా అప్లికేషన్లు స్వీకరించుటకు కమిషనర్ మీ సేవ ద్వారా అనుమతి తీసుకోని అప్లికేషన్లు స్వీకరించి, వచ్చిన దరఖాస్తులను (TS WEBSITE) ద్వారా జిల్లా అధికారులచే టీమ్ లు చేసి నిస్పక్షపాతికముగా అర్హులైన లబ్దిదారులను రెండు మాసములలో ఎంపిక చేయవలెనని రెవెన్యూ, హౌసింగ్ అధికారులను ఆదేశించారు 17, కోట్లతో మంజూరి కాబడిన మురికి కాలువల నిర్మాణము సెప్టిక్ ట్యాంక్ల నిర్మాణము, గృహములకు కరెంట్ పానెల్ బొర్డ్స్ రెండు మాసములలో పూర్తి చేయవలేనని పంచాయత్ రాజ్ అధికారులను ఆదేశించారు. 14, కోట్లతో మంజురైన వాటర్ ట్యాంక్, నీటి పైప్ లైన్లు డబుల్ బెడ్రూము గృహాలతో పాటు ఇందిరమ్మ కాలనీలో పైప్ లైన్లు నెల రోజులలో పూర్తి చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. నూకపల్లి కాలనీకి వెళ్ళే రహదారి ఆక్రమించుకున్న దానిని క్లియర్ చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

కాలనీలలో పేరుక పోయిన ముళ్ళపొదలు, పిచ్చి మొక్కలు తొలగించాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. జగిత్యాల పట్టణములో నిర్మించిన సమీకృత మార్కెట్ ను ప్రజలకు ఉపయోగములోకి తీసుకరావాలని శాసన సభ్యులు మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. నూకపల్లి అర్బన్ కాలనిని అమృత్ స్కీమ్ కు టై అప్ చేయ గలరని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి రెండు నెలలలో లబ్దిదారులకు అంద చేయుటకు ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ అధికారులకు నిర్దేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ P. రాంబాబు, RDO మధుసూదన్, రహమాన్, శేఖర్ రెడ్డి, సంపత్ రావు, EE లు మరియు J.రాజేశ్వర్, మిళింద్, జలెందర్, Dy.EE లు, కమీషనర్ సమ్మయ్య, తహసీల్దార్ వరందన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News