జైన మత ధర్మకర్త ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ఆదివారం తుది శ్వాస విడిచారు చత్తీస్గడ్ లోని డోంగర్ ఘర్ చంద్రగిరి తీర్థంలో ప్రఖ్యాత జైన ధర్మకర్త ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ఆధ్యాత్మిక శుద్ధి కోసం స్వచ్ఛందంగా ఆమరణ నిరాహార దీక్ష చేసే సల్లేఖానా సాధన ద్వారా దీక్షలో స్వచ్ఛందంగా మూడు రోజుల నుంచి ఆహారం పానీయాలు తీసుకోవడం మానేసిన ఆయన అనారోగ్యానికి గురై తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న గార్ల మండల జైన్ లు రావుక విమల్ జైన్ విపుల్ జైన్ మహావీర్ జైన్ పదం జైన్ ప్రవీణ్ జైన్ మహేందర్ జైన్ లు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 55 సంవత్సరాలు ముని దీక్షలో ఉంటూ జైనమతాన్ని వాటి నియమాలను చిత్తశుద్ధితో అనుసరించిన ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మరణం దేశానికి తీరని లోటని, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఎంతో కృషి చేశారని ఆయన సేవ చిరస్మరణీయమని పేదరిక నిర్మూలన, సమాజ ఆరోగ్యం, విద్యను ప్రోత్సహంచడానికి జీవితాన్ని అంకితం చేశారని, సమాజాభివృద్ధికి ఆయన అందించిన సహకారం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.