భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, ఇటీవల ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో మరోసారి ధర్మపురి నియోజకవర్గం, నుండి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతలు తెలిపారు అంబాల (ప్రభు) ప్రభాకర్. కరీంనగర్ లోని తన క్యాంప్ ఆఫీసులో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ… కార్మిక నాయకుని స్థానం నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ, ఉద్యమంలో కేసీఆర్ తో పాటు ఉద్యమం చేసి, అంచలంచెలుగా ఎదిగి నేడు సంక్షేమ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాదిమంది విద్యార్థిని విద్యార్థులకు, నాణ్యమైన విద్య, భోజనం, సౌకర్యాలను సమకూర్చేలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, అదేవిధంగా ఇటీవల పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని మెస్ చార్జీలు పెంపునకు తనదైన శైలిలో కృషి చేసి ముఖ్యమంత్రిని ఒప్పించి మెస్ చార్జీలు పెంపునకు కృషి చేశారన్నారు.