Sunday, July 7, 2024
HomeతెలంగాణJammikunta: జాగ్రత్త..డెంగ్యూ బారిన పడొద్దు

Jammikunta: జాగ్రత్త..డెంగ్యూ బారిన పడొద్దు

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటి ఆవరణలో నీటి నిలువ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే డెంగ్యూ బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సన జవేరియా పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాలలో వైద్య సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీలను నిర్వహించారు. ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సన జవేరియా మాట్లాడుతూ ఏడిస్ దోమ కాటు వల్ల డెంగ్యూ వస్తుందన్నారు.
చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలన్నారు. దోమలను పారదోలే మందులను ఉపయోగించాలని సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు కాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలన్నారు. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవడంతో పాటు పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పూలకుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల దోమలు ఎక్కువ కాకుండా ఉంటాయన్నారు. తాజా నీటిని కూడా కాచి చల్లార్చి తాగాలని ప్రజలకు సూచించారు. నీటి ద్వారే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి కాబట్టి శుద్ధమైన నీటినే తాగాలన్నారు. ఈ అవగాహన ర్యాలీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శంకర్ రెడ్డి, సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ, స్వరూప, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News