Sunday, November 16, 2025
HomeతెలంగాణJammikunta: భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టలో ఈటల

Jammikunta: భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టలో ఈటల

భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల అనుగ్రహంతో పంటలు సమృద్ధిగా పండి రైతన్నల ముఖాల్లో ఆనందం వెళ్ళు విరియాలని, గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్లను కోరుకున్నట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఈటెల అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట వేడుకలకు తన వంతు చేయూతగా రూ.50 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఐకమత్యంతో గ్రామ దేవతలను ప్రతిష్టించుకోవడం శుభసూచికమన్నారు. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామానికి చెందిన వారందరూ ఒక చోట చేరి, పండుగ వాతావరణం ప్రతిబింబించేలా ఇలాంటి వేడుకలు నిర్వహించుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో గత వైభవాన్ని గుర్తు చేస్తుందన్నారు. అమ్మవార్ల చల్లని చూపుతో గ్రామాలు పరిడవిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad