Friday, September 20, 2024
HomeతెలంగాణJammikunta: పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి

Jammikunta: పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో పరిసరాల పరిశుభ్రత పై పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19 నుండి 27 వరకు స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనీ 17వ,18వ వార్డులో డ్రైనేజీలలో పేరుకుపోయిన సీల్టు తొలగింపు, రోడ్డుకు ఇరువైపుల శుభ్రం చేస్తున్న పనులను స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. వార్డులో నెలకొన్న పలు సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు. అందులో భాగంగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పట్టణంలోని వార్డుల వారీగా నెలకొన్న సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారం పై అప్పటికప్పుడే చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలతో మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు. పట్టణ ప్రజలు కూడా తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు జుగురు సదానందం, బొద్దుల అరుణ రవీందర్, పారిశుద్ధ్య పర్యవేక్షకులు బోళ్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News