Saturday, November 15, 2025
HomeతెలంగాణJammikunta: మంత్రి శ్రీధర్ బాబు ఆత్మీయ పలకరింపు

Jammikunta: మంత్రి శ్రీధర్ బాబు ఆత్మీయ పలకరింపు

సన్నిహితుడి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు

20 ఏళ్లుగా తనతో సాన్నిహిత్యం కలిగి ఉన్న వ్యక్తి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి ఆప్యాయంగా పలకరించడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్ర మంత్రి అందులో ప్రభుత్వ నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే మంత్రిగా పేరు ఉన్న శ్రీధర్ బాబు సామాన్య జీవితం గడుపుతున్న వ్యక్తి ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి దశ దినకర్మకు హాజరయ్యేందుకు మంత్రి శ్రీధర్ బాబు జమ్మికుంటకు వచ్చారు. ఈ సందర్భంగా తనతో 20 ఏళ్ల సాన్నిహిత్యం కలిగి ఉన్న పిడుగు గట్టయ్య-భాగ్య దంపతులు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతినగర్ లో ఉంటున్నారని తెలుసుకొని వారి ఇంటికి స్వయంగా వెళ్లి ఆప్యాయంగా పలకరించడంతో కాంగ్రెస్ నాయకులతో పాటు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్ర మంత్రిగా ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీధర్ బాబు తనతో సాన్నిహిత్యం కలిగి ఉన్న పిడుగు గట్టయ్య కుటుంబ సభ్యులను పలకరించేందుకు వారి ఇంటికి రావడం తమకేంతో సంతోషాన్ని కలిగించిందని స్థానికులు తెలపడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad